Home  »  TV News  »  Illu illalu pillalu : రాత్రికి రాత్రే సీన్ సితార.. కొత్త కారుతో ఎంట్రీ ఇచ్చి ధీరజ్ సర్‌ప్రైజ్.!

Updated : Jul 5, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Ill illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -515 లో..... ప్రేమ ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదని వేదవతి టెన్షన్ పడుతుంది. ఈ ప్రేమ పావురాలు ఎక్కడున్నారో అని నర్మద వాళ్ళకి ఫోన్ చెయ్యాలని అనుకుంటుంది. మరొకవైపు ప్రేమని ధీరజ్ తిడతాడు. ఎవరిని నమ్మొద్దని చెప్పాను కదా ఎందుకు ఇలా మతిలేకుండా చేస్తావని కోప్పడతాడు. అప్పుడే స్టేజ్ పై ప్రేమ అని పిలుస్తారు. వెళ్ళు నిన్నే పిలుస్తున్నారు వచ్చినందుకు పార్టిసిపేట్ చెయ్.. నువ్వు వేసే కుప్పిగంతులకి ప్రైజ్ మనీ వస్తుందా అని ధీరజ్ అనగానే థాంక్స్ రా అని వెళ్లి డ్యాన్స్ చేస్తుంది. 

ధీరజ్ కీ నర్మద ఫోన్ చేస్తుంది. వస్తున్నాం వదిన వచ్చాక మాట్లాడుకుందామని ధీరజ్ అంటాడు. నర్మద ఫోన్ మాట్లాడడం వేదవతి విని ప్రేమ వాళ్ళ గురించి అడుగుదామని అనుకుంటుంది. తనకి ఇగో అడ్డు వచ్చి సైలెంట్ గా ఉంటుంది కానీ తర్వాత వాళ్లు ఎక్కడున్నారు అంట అని వేదవతి అడుగుతుంది. మీకెందుకు చెప్పాలని అనేసి నర్మద వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ డ్యాన్స్ చేస్తుండగా ప్రేమ కాలికి దెబ్బ తగులుతుంది. దాంతో ధీరజ్ వెళ్లి అది కవర్ చేస్తూ డ్యాన్స్ చేస్తాడు చివరికి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. కాంపిటేషన్ లో ప్రేమ విన్ అవుతుంది. ప్రేమకి చెక్ ఇవ్వబోతుంటే ధీరజ్ ని పిలుస్తుంది. ఇద్దరు కలిసి చెక్ తీసుకుంటారు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతారు.

అప్పుడే ధీరజ్, ప్రేమ కార్ లో వస్తారు. కార్ వాళ్ళు తీసుకొని వెళ్లారు కదా అని రామరాజు అడుగుతాడు. వాడి మొహనా పది లక్షలు కొట్టి కార్ ని తీసుకొని వచ్చానని ధీరజ్ చెప్పగానే రాత్రికి రాత్రి డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది ఏదైనా లాటరీ తగిలిందా అని వల్లి అనగానే అవును వదిన కరెక్ట్ చెప్పారు లాటరీ తగిలిందని ధీరజ్ అంటాడు నేను చీర కొంటే లాటరీ తగిలిందని ప్రేమ చెప్పగానే నువ్వు వెళ్ళింది హాస్పిటల్ కదా అని వల్లి అంటుంది. పక్కన షాప్ లో కొన్నానని ప్రేమ చెప్తుంది. నాలాగే నా కోడలు కూడా అదృష్టవంతురాలు అని వేదవతి మురిసిపోతుంది. ఆ తర్వాత ప్రేమ,  ధీరజ్ వంక నర్మద కోపంగా చూస్తుంది. అలా చూడకు అక్క ధీరజ్ ఆల్రెడీ తిట్టేసాడని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

Illu Illalu Pillalu Serial Today Episode, Star Maa Illu Illalu Pillalu Telugu, Prema Dheeraj Dance Competition, Illu Illalu Pillalu Serial Highlights, Telugu Serial Latest Updates TeluguOne.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.